ఆంధ్ర ప్రదేశ్ హోం శాఖ మంత్రి తానేటి వనిత
విజయవాడ రాజ్ భవన్ లో త్రివిధ దళాల ఫ్లాగ్ డే
విజయవాడ : విజయవాడ లోని రాజ్ భవన్ లో త్రివిధ దళాల ఫ్లాగ్ డే కార్యక్రబన్నీ
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ , హోంమంత్రి
తానేటి వనిత , హోం ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, కలెక్టర్లు
ప్రశాంతి, దిల్లీ రావు, జేసీ లు, ఇతర సైనిక అధికారులు పాల్గొన్నారు. త్రివిధ
దళాల్లో పనిచేసే సైనికులు, వారి కుటుంబసభ్యుల సంక్షేమం కోసం ప్రతి ఏటా
డిసెంబర్ లో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ను నిర్వహించడం జరుగుతోంది. ఈ
సందర్భంగా యుద్ధంలో గాయపడిన సైనికులకు, వీరమరణం పొందిన సైనికుల కుటుంబసభ్యులకు
గవర్నర్ ఉస్వభూషన్ గారు, హోంమంత్రి తానేటి వనిత అవార్డులను, నగదు
ప్రోత్సహకాలను అందించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ
త్రివిధ దళాల ఫ్లాగ్ డే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారత
సరిహద్దులో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పని చేస్తున్న సైనికుల సేవలను
వెలకట్టలేమని హోంమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలో బలమైన దేశంగా భారత్
తలెత్తుకు నిలబడిందంటే దానికి మన సైనికుల శక్తి సామర్ధ్యాలే కారణమన్నారు.
భారతదేశ ప్రజలందరూ సంతోషంగా, శాంతియుతంగా ఉన్నాము అంటే దానికి సైనికుల త్యాగమే
ప్రధాన కారణమన్నారు. దేశ సేవలో ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు హోంమంత్రి
తానేటి వనిత ఘన నివాళులర్పించారు.