హైదరాబాద్ : సాంకేతిక వినియోగం గణనీయంగా పెరుగుతున్నందున ప్రపంచవ్యాప్తంగా
సైబర్ నేరాలు పెరుగుతున్నాయని డీజీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. దీని
ప్రభావం రాష్ట్రంలోనూ ఉందని, ఇక్కడ కూడా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందన్నారు.
రాష్ట్రంలో నేరాలు, ఫంక్షనల్ వర్టికల్స్పై అన్ని జిల్లాల ఎస్పీలు,
కమిషనర్లతో డీజీపీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ
సైబర్నేరాలకు సంబంధించి కేసులు నమోదు చేయడంలో తెలంగాణ దేశంలోనే ముందుందని, ఈ
తరహా నేరాలు అరికట్టడంలోనూ రాష్ట్ర పోలీసు యంత్రాంగం దేశంలో అగ్రస్థానంలో
ఉందన్నారు. రాష్ట్రంలో దర్యాప్తులో ఉన్న కేసులు 52.01 శాతానికి తగ్గాయని,
పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా గణనీయంగా తగ్గాయన్నారు. ఎన్నికలు
సమీపిస్తున్న తరుణంలో వీఐపీల పర్యటన సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,
సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతికూల వార్తలను గమనిస్తూ ఎప్పటికప్పుడు వివరణ
ఇవ్వాలని అంజనీకుమార్ సూచించారు. అదనపు డీజీలు మహేష్భగవత్, అభిలాష బిస్త్,
ఐజీలు షానవాజ్ ఖాసీం పాల్గొన్నారు. పోగొట్టుకున్న సెల్ఫోన్ల ఆచూకీ తిరిగి
రాబట్టి బాధితులకు అందించడంతో పాటు, కృషి బ్యాంకు డిపాజిటర్లను గుర్తించి
వారికి డబ్బు అందజేసిన సీఐడీ పోలీసులను డీజీపీ అభినందించి, ప్రశంసా పత్రాన్ని
అందించారు.

శిక్షణ పోలీసులకు మంచి విషయాలు బోధించాలి : కొత్తగా పోలీసు బాధ్యతలు
చేపట్టేవారికి మంచి శిక్షణ ఇవ్వడం అంటే సమాజానికి ఉత్తమ సేవలు అందించడమేనని,
శిక్షణకు హాజరుకానున్న ఎస్సై, కానిస్టేబుళ్లకు పోలీసు కళాశాలల్లోని సిబ్బంది
మంచి విషయాలను బోధించాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. రాష్ట్రంలో 14,881
మంది ఎస్సై, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకోగా, వీరికి
సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో శిక్షణ మొదలుకానుంది. ఈ ఏర్పాట్లపై
చర్చించేందుకు డీజీపీ మంగళవారం 28 పోలీసు శిక్షణ కళాశాలల ప్రిన్సిపాళ్లతో
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.