చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై ఆల్ రౌండ్ షో తో సన్ రైజర్స్ హైదరాబాద్ పై
విజయం సాధించింది . చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్
రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134
పరుగులు చేయగా… లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు
138 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 57 బంతుల్లో 77 పరుగులు చేసి సూపర్
కింగ్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతడి స్కోరులో 12 ఫోర్లు, 1 సిక్స్
ఉన్నాయి.

మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 35 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో మయాంక్
మార్కండే 2 వికెట్లు తీశాడు.
ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.
చెన్నై ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు నమోదు చేసింది. అదే సమయంలో, సన్
రైజర్స్ 6 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు సాధించింది.