చెబుతున్నారు. నిజానికి ఇది మనకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది.వీటిలో
కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ కంటెంట్ మాత్రం చాలా ఎక్కువగా
ఉంటుంది. ఇది మన ఆకలిని నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. ఎలా అంటే ఇది
కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఉదయం పరిగడుపున సోంపు నీటిని తాగితే
మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారంటున్నారు నిపుణులు.
*సోంపు ఎన్నో ఔషధ గుణాలను కలిగిన ఉన్న మసాలా దినుసు. సోంపు గింజల్లో కేలరీలు
తక్కువగా ఉంటాయి. ఈ మసాలా దినుసుల్లో స్థూల, సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఈ గింజల్లో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, జింక్,
పొటాషియం, సెలీనియం, ఐరన్ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ
ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
*పరగడుపున సోంపు గింజల నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని
ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఒక గ్లాసు సోంపు నీటిని తాగడం వల్ల
జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం నుంచి ఉపశమనం
పొందుతారు. ఈ నీరు జీర్ణ ప్రక్రియను ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది. అలాగే
జీర్ణశయాంతర ప్రేగు మొత్తం ఆరోగ్యానికి మద్దతునిస్తుంది.
*సోంపు గింజల్లో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలతో సహా యాంటీ ఆక్సిడెంట్లు
పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి
రక్షించడానికి సహాయపడతాయి.
*సోంపులో కరిగే ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని
నియంత్రించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడతాయి.
సోంపులో బీటా కెరోటిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్
ఉన్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడే మరొక యాంటీ
ఆక్సిడెంట్.
*సోంపులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది సహజంగా ఆమ్ల సమతుల్యతను
నియంత్రించడానికి, రక్తపోటును స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. సోంపు గింజలను
నమలడం వల్ల రక్తపోటు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటుంది.