అల్ నాసర్ ఎఫ్‌సి కీలక ప్రకటన
క్రిస్టియానో రొనాల్డో మంగళవారం (జనవరి 3న) రియాద్‌లో అల్ నాసర్ తరపున
ఆడబోతున్నాడు. ఈ మేరకు మంగళవారం క్లబ్ ప్లేయర్‌గా క్రిస్టియానో రొనాల్డో
అధికారికంగా ఆవిష్కరించబడతారని అల్ నాసర్ ఎఫ్‌సి ప్రకటించింది. రొనాల్డో అల్
నాసర్తో రెండున్నర సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేశాడు. రొనాల్డో మాంచెస్టర్
యునైటెడ్‌తో తన ఒప్పందాన్ని నవంబర్‌లో ముగించాడు. క్రిస్టియానో రొనాల్డోను
ప్లేయర్‌గా అధికారికంగా రియాద్‌లో క్లబ్ హోమ్ గ్రౌండ్ అయిన మిర్సూల్ పార్క్‌లో
ఆవిష్కరించనున్నట్లు సౌదీ అరేబియా క్లబ్ అల్ నాసర్ ఎఫ్‌సి సోమవారం
ప్రకటించింది. పియర్స్ మోర్గాన్‌తో వివాదాస్పద ఇంటర్వ్యూ నేపథ్యంలో ప్రపంచ కప్
సమయంలో మాంచెస్టర్ యునైటెడ్‌తో తన ఒప్పందం రద్దు అయిన తర్వాత రొనాల్డో సౌదీ
అరేబియా వైపు వెళ్లిన విషయం తెలిసిందే.