ఇస్రోకు అందజేసిన ఐయూసీఏఏ
శ్రీహరికోట : సౌర వాతావరణ పరిశీలనకు తయారుచేసిన సన్ అల్ట్రా వయొలెట్
ఇమేజింగ్ టెలిస్కోప్ (ఎస్యూఐటీ)ను పుణెలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్
ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐయూసీఏఏ) అభివృద్ధి చేసింది. దీనిని
ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు ఐయూసీఏఏ శాస్త్రవేత్తలు
అందజేశారు. ఆదిత్య-ఎల్1 మిషన్లో భాగంగా ఈ టెలిస్కోప్ సూర్యుని వైపు దాదాపు
15 లక్షల కి.మీ. ప్రయాణించనుంది. ప్రత్యేకంగా ఎల్1 పాయింట్, సూర్యుని
ఉపరితలం, అంతరిక్ష వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడానికి
దీనిని రూపొందించారు. ప్రొఫెసర్ ఏఎన్ రాంప్రకాష్, ప్రొఫెసర్ దుర్గేష్
త్రిపాఠిలు ఎస్యూఐటీ రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించారు.