స్కాట్లాండ్ :: స్కాట్లాండ్లో మొట్టమొదటి తెలుగు అష్టావధానం ఉత్సాహభరితంగా
సాగింది. జులై 9న ఎడింబరో నగరంలోని హిందూ మందిర్‌లో ఏలూరుకు చెందిన శ్రీ ప్రణవ
పీఠాధిపతి వద్దిపర్తి పద్మాకర్ దీన్ని నిర్వహించారు. విజయ్‌కుమార్ రాజు
పర్రి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. గౌరవ అతిథిగా హాజరైన స్కాట్లాండ్
తెలుగు సంఘం ఛైర్పర్సన్ మైథిలి కెంబూరి జ్యోతి ప్రజ్వలన చేశారు. గాయకుడు
కుమార్ అనీశ్ కందాడ గణేశుని ప్రార్థనాగీతంతో అష్టావధానం అట్టహాసంగా
ప్రారంభమైంది. పృచ్ఛకులను పల్లవి మంగళంపల్లి వేదికపైకి ఆహ్వానించారు. అవధాని
వద్దిపర్తి పద్మాకర్ తన అపారజ్ఞానంతో అన్ని అంశాలకు పద్యాలను అల్లిన తీరు
పృచ్ఛకులకే కాకుండా శ్రోతలకు కూడా ఆనందం కలిగించిందని నిర్వాహకులు తెలిపారు.
విశ్రాంత అధ్యాపకులు అయ్యగారి జగన్నాథ కామేశ్వర ప్రసాద్ అవధాని ధారణ శక్తిని
కొనియాడుతూ పృచ్ఛకుల కార్యదక్షతను ప్రశంసిస్తూ విమర్శనాత్మక విశ్లేషణ చేశారు.
అనంతరం అవధాని వద్దిపర్తి పద్మాకర్ దంపతులను నిర్వాహకులు విజయ్, పృచ్ఛకులు
ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత 12 మంది పృచ్ఛకులను వద్దిపర్తి పద్మాకర్ చేతుల
మీదుగా సన్మానించారు. పొరుగు నగరాల నుంచి వందలాదిగా తెలుగువారు ఎడింబరో వచ్చి
ఈ అష్టావధానాన్ని ఆసక్తిగా తిలకించారు. బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఏజీఎం
అయ్యగారి కోదండరావు, పృచ్ఛకులకు తోడ్పాటునందించిన తల్లాప్రగడ రామచంద్రరావు,
హిందూమందిర్ యాజమాన్యం రాజశేఖర్ జాలాతోపాటు అష్టావధానం నిర్వహణకు తోడ్పడిన
వాలంటీర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంగళహారతితో శ్రీవిద్య
కందాడ, రేఖ దుగ్యాల, రాజి కార్యక్రమాన్ని చక్కగా ముగించారు. అదేరోజు సాయంత్రం
‘శ్రీకృష్ణ లీలలు’ అంశంపై భక్తి ప్రవచనాల కార్యక్రమం అద్భుతంగా జరిగినట్లు
నిర్వాహకులు తెలిపారు.