స్కూల్ కు వెళ్లే పిల్లల బ్యాగుల్లో క్లాస్ పుస్తకాలు కాకుండా.. కండోమ్ లు,
గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు బయటపడిన సంఘటన బెంగళూరులో బుధవారం
చోటుచేసుకుంది. 8,9,10 తరగతులు చదివే విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్ లు,
గర్భనిరోధక మాత్రలు కనిపించాయి. విద్యార్థులు సెల్ ఫోన్లు వాడుతున్నారని
టీచర్లకు అనుమానం వచ్చింది. దీంతో వారు విద్యార్థుల బ్యాగులు చెక్ చేశారు.
అయితే వారి బ్యాగుల్లో అంతకుమించి వస్తువులు కనిపించాయి. విద్యార్థుల
బ్యాగుల్లో కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు, లైటర్లు, వైట్నర్లు,
క్యాష్ చూసి టీచర్లు నిర్ఘాంతపోయారు. కొంతమంది పిల్లల వాటర్ బాటిల్స్ లో తాగే
నీరు కాకుండా మద్యం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో స్కూల్ యాజమాన్యాలు వెంటనే
అలర్ట్ అయ్యాయి. ఆ పిల్లలపై చర్యలు తీసుకోవడానికి బదులుగా.. వారి
తల్లిదండ్రులను పిలిపించి మీటింగ్ పెట్టారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
విద్యార్థులు.. మొబైల్ ఫోన్స్ తీసుకొస్తున్నారనే ఫిర్యాదుతో నగరంలోని పలు
పాఠశాలల్లో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైస్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో
ఆకస్మిక తనిఖీలు చేయగా.. ఈ షాకింగ్ విషయం వెలుగుచూసింది. ఫోన్లు
తీసుకొస్తున్నారనే కంప్లైంట్స్ వస్తుండటంతో.. విద్యార్థుల బ్యాగులు తనిఖీ
చేయాలని స్కూళ్ల యాజమాన్యాలను కర్ణాటకలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్
మేనేజ్మెంట్ అసోసియేషన్ (కేఏఎంఎస్) ఆదేశించింది. ఒక విద్యార్థి బ్యాగ్ లో
నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు(ఐ-పిల్) లభించాయని, అలాగే వాటర్
బాటిల్లో మద్యం దొరికిందని కేఏఎంఎస్ ప్రధాన కార్యదర్శి శశికుమార్
వెల్లడించారు.