విజయవాడ : స్టాఫ్ నర్సుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజులా దేవి గురువారం
విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ బిస్వ బూషన్ హరిచందన్ ను కలిశారు. ఈమేరకు ఆయనకు
ఒక వినతి పత్రాన్ని అందజేశారు. వైద్య ఆరోగ్య శాఖ లో ఆరోగ్య కార్యకర్తలుగా
విధులు నిర్వర్తించే ఏ ఎన్ ఎం లను స్టాఫ్ నర్సులు గా సర్దుబాటు చేసే
నిర్ణయాన్ని ఉప సంహరించుకావాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నర్సుల అసోసియేషన్
రాష్ట్ర అధ్యక్షురాలు మంజులా దేవి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర
స్థాయిలో ఆరోగ్య కార్య కర్తలైన ఏఎన్ ఎంలను కేవలం రెండు సంవత్సరాలు జీఎన్ఎం
ట్రైనింగ్ పేరుతో శిక్షణ ఇచ్చి నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేయకుండా
స్టాఫ్ నర్సులుగా ఆసుపత్రుల్లో సర్దుబాటు చేయడాన్ని ఖండిస్తున్నామని
పేర్కొన్నారు. 30 సంవత్సరాలు అవుతున్నా స్టాఫ్ నర్సులకు హెడ్ నర్సులుగా
పదోన్నతులు ఇవ్వకపోగా, 10 12 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో అన్ని
ప్రభుత్వ ఆసుపత్రులలో జి ఎం ఎం మరియు బిఎస్సి నర్స్ యస్ , ఎమ్మెస్సీ నర్సెస్,
చదివిన వారు మాత్రమే స్టాప్ నర్సులుగా విధులు నిర్వహిస్తున్నారని, వారిని
ముందుగా రెగ్యులర్ చేసి అన్ని ఆరోగ్య శాఖలలో సర్దుబాటు చేయలని గవర్నర్ ను
కోరారు. స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాల్లో చేరటానికి కొన్ని అర్హతలు ఉండాలనీ,
వాటిలో నర్సింగ్ కౌన్సిలింగ్ లో రిజిస్టర్ అయి ఉండాలని, రాత పరీక్షలు, మెరిట్
ద్వారా స్టాఫ్ నర్స్ ను సెలెక్ట్ చేయాలని, ఈ అర్హతలు లేకుండా ట్రైనింగ్ ఇచ్చిన
ఏఎన్ఎం ని డైరెక్ట్ గా స్టాప్ నర్సులు పోస్టులు ఇవ్వడం ఎంతవరకు సబబని
పేర్కొన్నారు. రాష్ట్రంలో నర్సింగ్ వ్యవస్థకు న్యాయం చేకూర్చాలని ప్రతి
ఒక్కరినీ కోరుకుంటున్నామని, పై చదువులు చదవడానికి ప్రతి ఒక్క ప్రభుత్వ
ఉద్యోగికి అనుమతి ఇవ్వండి కానీ, ఈ రకమైన కొత్త నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు
తీసుకొని నర్సింగ్ వ్యవస్థ కు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.