హాట్ టాపిక్ అవుతున్నాడు ఉమైర్ సందు. తనకి తాను దుబాయ్ సెన్సార్ బోర్డు
సభ్యుడిని అని చెప్పుకునే ఈ వ్యక్తి నిజంగా ఉన్నాడో లేడో తెలియదు!. కానీ
బాలీవుడ్ గురించి ఈ మధ్య కాలంలో టాలీవుడ్ గురించి కూడా అనేక సంచలన వ్యాఖ్యలు
చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు ఉమైర్. గతంలో అనేక ట్విట్టర్
ఎకౌంట్ల ద్వారా హల్చల్ చేస్తూ వస్తున్న ఈ వ్యక్తి.ఇప్పుడు ఒకే ట్విట్టర్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ బాలీవుడ్ హీరోల మీద హీరోయిన్ ల
మీద టాలీవుడ్ హీరోల మీద హీరోయిన్ ల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. ఈ
మధ్యకాలంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి వారు పేర్లను కూడా
ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు ఒక స్టార్ హీరో
కొడుకు గే అయ్యాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గే అంటే దాదాపుగా అందరికీ
తెలిసే ఉంటుంది, స్వలింగ సంపర్కులు.
ఇప్పుడు ఆయన టార్గెట్ చేసిన వ్యక్తి పేరు ఇబ్రహీం అలీ ఖాన్ ఆయన ఎవరో కాదు
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు. తాజాగా సైఫ్ అలీఖాన్ కుమారుడు
ఇబ్రహీం అలీ ఖాన్ ఫోటో షేర్ చేసిన ఉమైర్ సందు ఇబ్రహీం అలీ ఖాన్ ఇప్పుడు గే
అయ్యాడట అసలు ఈ స్టార్ కిడ్స్ కి ఏమవుతుంది? ఎందుకు వీళ్లంతా స్వలింగ
సంపర్కులుగానే మారిపోతున్నారు అంటూ కామెంట్ చేశారు.
అయితే తెలుగు హీరోల గురించి ఆయన వ్యాఖ్యలు చేసినప్పుడు తెలుగు అభిమానులు
తీవ్రస్థాయిలో ఫైర్ అవుతూ అతని మీద మండిపడ్డారు. కానీ అదేం విచిత్రమో బాలీవుడ్
అభిమానులు మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలను చాలా సిల్లీగా తీసుకుంటూ ఆయన చేస్తున్న
కామెంట్లను ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొంతమంది ఆయనకు మద్దతుగా కామెంట్లు
చేస్తున్నారు.