బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
రక్తహీనతతో పిల్లలు, గర్భవతులు బాలింతలు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా ఆరోగ్య శాఖ సిబ్బంది పని చేయాలని జీల్లా టాస్క్ ఫోర్స్
డి పి ఎం ఓ డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కామకూరు,బాలాయ పల్లి జయంపు సచివాలయం పరిధిలో రక్తహీనత ఉన్న పిల్లలను గర్భవతులను గుర్తించి పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గర్భవ తులు రక్తహీనత వల్ల కాన్పు సమయంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల గర్భవతు లను గుర్తించి వారికి రక్తహీనత తగ్గే మాత్రలను పంపిణీ చేయాలని ఆదేశించారు. మనం బాధ్యతగా చేస్తే పేదలు రక్తహీనతతో ఎటువంటి మరణాలు లేకుండా పోతాయని తెలియజేశారు. మండలంలోని అన్ని సచివాలయం వైద్ధ సిబ్బంది బాధ్యతగా పనిచేయాలన్నారు. అనంతరం హెచ్ బి పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి నాగేంద్ర కుమార్, డి పి హెచ్ ఎన్ ఓ బేబి రాణి, డిపిఓ ప్రకాష్, స్థానిక ప్రాథమిక ఆరోగ్య శాఖ అధికారిని ప్రమీల సూపర్వైజర్ రాజేశ్వరి, ఏ ఎన్ ఎంలు మునింద్ర,మేరి,మహిత, హెల్త్ అసిస్టెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో :- పరీక్షలు చేస్తున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది