స్థానిక ప్రజలు గుడి నిర్మించాలని కోరుకుంటున్నారని, వారి ఆశయమే తనకు దిక్సూచి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎదురు గ్రామం లో విష్ణు వర్ధన్ రెడ్డి అందరిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తీర్మానం పేరుతో రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడమే టీడీపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు నియోజకవర్గాన్ని దోచుకుంటే తాము రూ. 150 కోట్లు ఖర్చు చేసి కొడుమూరులో రోడ్డు వేయించామని తెలిపారు. మరికొన్ని ప్రాజెక్టులు టెండర్ ప్రాసెసింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. రూ. 55 కోట్ల నిధులతో గూడూరు నగర పంచాయత్ లో నీళ్ల ట్యాంక్ లు నిర్మిస్తున్నామని తెలిపారు.