కార్యక్రమాలుటీ-ఇన్నోవేషన్ మహోత్సవ వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
దయాకర్ రావు
హైదరాబాద్ : స్థానిక సంస్థలు, గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కరానికి
టీ – ఇన్నోవేషన్ దోహద పడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,
గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తెలంగాణ పల్లెల్లో ఇన్నోవేషన్ను ప్రోత్సహించేందుకు టీఎస్ఐసీ ద్వారా
టీ-ఇన్నోవేషన్ మహొత్సవ్ ను నిర్వహిస్తున్నది. ఇందుకు సంబంధించిన
పోస్టర్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ లోని మంత్రుల
నివాసంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి
ఎర్రబెల్లి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ మార్గనిర్దేశంతో, మంత్రి కెటిఆర్
చొరవతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో సామాజిక, గ్రామీణ
ప్రాంతాల సమస్యల పరిష్కారానికి కూడా విస్తరిస్తూ, టీ ఇన్నోవేషన్
వినూత్న ఆలోచనతో ముందుకు రావడం సంతోషం అన్నారు. ప్రపంచ సృజనాత్మక మరియు
ఆవిష్కరణ దినోత్సవం ఏప్రిల్ 21 సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు
సంబంధిత శాఖను మంత్రి అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సమస్యలు,
అభివృద్ధి కి ఆటంకాలు, ప్రజల ఆలోచనల్లో రావాల్సిన మార్పులపై దృష్టి
సారించి, ప్రజల్లో ఉన్నతమైన, గ్రామీణ ప్రాంతాల, సమాజ నిర్మాణానికి,
ప్రజల జీవన శైలితో పాటు ప్రమాణాల మెరుగుదలకు పాటు పడాల్సిన అవసరం
ఉందన్నారు. ముందుగా సమస్యలను అధ్యయనం చేసి, తర్వాత వారితో చర్చించి,
నూతన పరిష్కారాలు కనుగొనాలని మంత్రి సూచించారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సదీప్ కుమార్
సుల్తానియా మాట్లాడుతూ, అట్టడుగున ఉన్న ప్రజల సమస్యలకు అత్యాధునిక
సాంకేతిక పరిష్కారాలు కొత్త ఆవిష్కరణలకు దారి చూపుతాయన్నారు. ఇందుకు
అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని అన్నారు.
తెలంగాణ సి ఐ ఓ డాక్టర్ శాంత తౌటం మాట్లాడుతూ, “TSIC రాష్ట్రంలోని గ్రామీణ
ప్రజల్లో కూడా ఆవిష్కరణల ఆలోచనను కలిగించడం లక్ష్యంగా పెట్టుకుంది. అవర్ ఫర్
ఇన్నోవేషన్ కార్యక్రమం ప్రజలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి
రూపొందించబడింది, వారి సమస్యలను సమిష్టిగా చర్చించి, ఆలోచించి,
పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. తెలంగాణ స్టేట్
ఇన్నోవేషన్ సెల్, పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతో కలిసి ఈ సంవత్సరం
T-ఇన్నోవేషన్ మహోత్సవం 21 ఏప్రిల్ 2023న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుందని
తెలిపారు.