అన్నీ మన చేజారి పోతున్నప్పుడే కదా మనం ఇతర దారుల్ని వెతుక్కుంటాం’ అంటున్నారు
నిఖిల్. ఆయన ఓ గూఢచారి పాత్రలో నటించిన చిత్రం ‘స్పై’ .ఆయన ఎలాంటి దారుల్ని
వెతుక్కుని తన మిషన్‌ని పూర్తి చేశాడో తెలియాలంటే ‘స్పై’ చిత్రం చూడాల్సిందే.
నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం స్పై. ఐశ్వర్య మేనన్
కథానాయిక. సన్యా మేనన్, ఆర్యన్ రాజేశ్, అభినవ్ గోమటం కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమాకి గ్యారీ బీ.హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే ఎడిటర్. కె.రాజశేఖర్
రెడ్డి కథని సమకూరుస్తూ, స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 29న చిత్రం
ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది.
‘చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు దాస్తుంది .దానికి సమాధానం మనమే వెతకాలి’
అంటూ మొదలయ్యే ట్రైలర్ లో ‘స్వాతంత్య్రం’ అంటే ఒకరు ఇచ్చేది కాదు లాక్కునేది.
ఇది నేను చెప్పింది కాదు, నేతాజీ చెప్పింది’ అంటూ కథానాయకుడు రానా దగ్గుబాటి
తళుక్కున మెరవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో ఆయన అతిథి పాత్రలో
నటించారు. కీలకమైన ఓ మిషన్ బాధ్యతల్ని భుజాన వేసుకున్న జై అనే గూఢచారి పాత్రలో
నిఖిల్ నటించినట్టు స్పష్టమవుతోంది. ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్
లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ “ఈ సినిమాలో వివాదానికి
దారితీసే అంశాలేమీ ఉండవు. సినిమా ఎవరినీ ఇబ్బంది పెట్టేలా ఉండదు. చరిత్రలో
మనకి తెలియని కోణాన్ని ఇందులో చూస్తారు. దక్షిణాది భాషలతోపాటు, హిందీలోనూ,
బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ సినిమాని విడుదల చేస్తున్నాం” అన్నారు. ఈ
కార్యక్రమంలో ఐశ్వర్య మేనన్, నిఖిల్,సన్య మేనన్, తదితరులు పాల్గొన్నారు.