వైయస్సార్సీపి ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిని
కలిసిన రాష్ట్ర స్వర్ణకార సంఘ ప్రతినిధులు
కలిసిన రాష్ట్ర స్వర్ణకార సంఘ ప్రతినిధులు
గుంటూరు : స్వర్ణకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం వైయస్సార్సీపి
ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిని రాష్ట్ర స్వర్ణకార
సంఘ ప్రతినిధులు కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘ అధికార
ప్రతినిధి, బీసీ సంక్షేమ సంఘం విజయవాడ యువజన అధ్యక్షులు పి . సాయికిరణ్, జి
మురళి, టి. శంకర్ , జి. శివ, అభి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా సాయికిరణ్
మాట్లాడుతూ స్వర్ణకారులకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి
దాన్ని పరిష్కరిస్తానని, అలాగే వైఎస్ఆర్సిపి పార్టీలో కష్టపడిన వారికి తగిన
ప్రాధ్యాన్యత ఉంటుందని భరోసా కల్పించారన్నారు. దానికి స్వర్ణకారులు, సంఘ
నాయకులు ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు.