నెల్లూరు : భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జిల్లాలో 6 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం గూడూరు రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 1-10 గంటలకు వెంకటాచలం లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ కు చేరుకున్నారు. వారికి నెల్లూరు ఆర్డిఓ ఏ మలోల పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వెంకటాచలం తహసిల్దార్ శ్రీ నాగరాజు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.