స్పెయిన్‌పై 2-0తో గెలుపు
హాకీ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు శుభారంభం చేసింది. హర్మన్‌ప్రీత్ సింగ్
సారథ్యంలోని భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌ను 2-0తో ఓడించింది.
భారతదేశంలోని ఒడిశాలో హాకీ ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి . జనవరి 13
శుక్రవారం ప్రారంభమైన టోర్నమెంట్ మొదటి రోజు చివరి గ్రూప్ మ్యాచ్‌లో
రూర్కెలాలోని బిర్సా ముండా స్టేడియంలో భారత్- స్పెయిన్ తలపడ్డాయి, ఇక్కడ భారత్
48 సంవత్సరాల తర్వాత రెండు ఫస్ట్ హాఫ్ గోల్స్ సహాయంతో టైటిల్ గెలుచుకుంది.
నిరీక్షణకు ముగింపు పలికే దిశగా తొలి అడుగు వేసింది. స్పెయిన్‌తో తలపడిన
మ్యాచ్‌లో 2-0తో ఘన విజయాన్ని అందుకుంది. స్పెయిన్‌తో జరిగిన పోరులో భారత్ ఆట
ఆరంభం నుంచి స్పెయిన్‌పై ఆధిపత్యాన్ని చెలాయించింది. భారత జట్టు వైస్
కెప్టెన్ అమిత్ రోహిదాస్ 12వ నిమిషంలో తొలి గోల్ కొట్టి ఖాతాను శుభారంభం
చేశారు.. హార్దిక్ సింగ్ 26వ నిమిషంలో రెండో గోల్ కొట్టాడం భారత్‌కు కలిసి
వచ్చింది. దీంతో మ్యాచ్ ఆఫ్ టైం ముగిసేసరికి 2 గోల్స్‌తో లీడ్‌లో ఉంది. ఆ
తర్వాత ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం కూండా అదే జోష్‌ను కొనసాగింది భారత్. దీంతో
విజయం భారత జట్టును వరించింది. జనవరి 15న జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్
ఇంగ్లాండ్‌తో ఢీ కొట్టనుంది. స్పెయిన్‌పై విజయంతో భారత్ ఖాతాలో 3 పాయింట్లు
వచ్చాయి.