విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో
బుధవారం ఎపిసిసి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర
కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, సమన్వయ
కమిటీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్సులు, జిల్లా మరియు నగర
అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, పిసిసి సభ్యులు, పిసిసి కోఆప్షన్ సభ్యులు
పాల్గొన్నారు. ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ
పిలుపుమేరకు నిర్వహించనున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్, చేయి చేయి కలుపుదాం,
రాహుల్ గాంధీ ని, కాంగ్రెస్ పార్టీ ని బలపరుద్దాము పేరిట చేపట్టనున్న
కార్యక్రమాన్ని అన్ని జిల్లాల, జిల్లా, నగర అధ్యక్షులు సమన్వయము చేసుకుంటూ ఈ
కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా పిలుపునిచ్చారు.
రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనవరి 26 నుండి మార్చి 26 వరకు రాష్ట్రవ్యాప్త
పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపిన ఆయన పాదయాత్రలో 15 రోజులు నగరాల్లోనూ, 15
రోజులు పట్టణాలు, అనంతరం మునిసిపాలిటీ లు, గ్రామీణ ప్రాంతాలలో తిరిగేలా
కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం
గురించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, దళితులంటే జగన్
రెడ్డి కి చిన్న చూపని విమర్శించారు. దళితులమీద నిజంగా జగన్మోహన్ మోహన్ రెడ్డి
కి ప్రేమ ఉంటే ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గురించి కూడా నవరత్నాలతో పాటుగా
అమలుచేయమని డిమాండ్ చేశారు.
సీనియర్ ముఖ్య నాయకులు డా.కెవిపి రామచంద్ర రావు మాట్లాడుతూ 13 పార్టీ ల
మధతుతో అప్పటి కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం సోనియా గాంధీ ప్రతిపాదనతో, రాహుల్
గాంధీ ప్రోత్సాహం తో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ 5 సంవత్సరాల ప్రత్యేక హోదా
అమలు చేస్తామని ప్రతిపాదన చేశారు. కానీ అప్పటి ప్రతిపక్ష బీజేపీ నాయకులు ఆంధ్ర
కి 5 కాదు 10 సంవత్సరాలు కావాలని డిమాండ్ చేసి ఆ ప్రతిపాదనకు అప్పటి యుపిఎ
ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా అమలయ్యేలా మద్దతు పలికింది. కానీ
ఇపుడున్న అదే బిజెపి ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కింది. పోలవరం కేంద్ర
ప్రభుత్వం నిర్ణయించాల్సి. వుండగా దాన్ని నీరు కారుస్తూ చంద్రబాబు ప్రభుత్వం,
ఇప్పటి జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని నీరుగార్చి, పోలవరం నిర్వాసితులకు
కూడా దారి చూపలేని, ప్రోత్సాహకాలు అందించలేని హీన, దీన స్థితిలో జగన్ ప్రభుత్వ
ఉందని అన్నారు. దేశ, రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకే మొగ్గు
చూపుతున్నారు కాబట్టి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి ప్రతి ఇంటి గడపకు
ప్రచారం చేసి కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయవలసినదిగా కోరారు. ఈ సమావేశంలో
పాల్గొన్న నాయకులు అందరు కూడా రాష్ట్ర కాంగ్రెస్ పాదయాత్రకు మద్దతు పలికారు,
అదేవిధంగా ఈ పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కాంగ్రెస్ శ్రేణులకు
పిలుపునిచ్చారు.