గుంటూరు : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఏపీ
రాజకీయ ప్రస్థానంలో మరిచిపోలేని ఒక ఘట్టం. సోమవారం ఆ యాత్ర పూర్తై నాలుగు
సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో
వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు పార్టీ
నేతలు, కార్యకర్తలు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల
రామకృష్టారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ సురేష్
తదితరులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ ప్రజల్లో ఉండటమే
రాజకీయం అని నమ్మిన వ్యక్తి జగన్. పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలు
మ్యానిఫెస్టోలో రూపొందించారు. ఇప్పటివరకూ 98 శాతం మ్యానిఫెస్టోలో ఇచ్చిన
హామీలు పూర్తి చేశారు. ప్రజలకు ఏమీ కావాలో అది చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్.
ప్రజలకు మంచి చేశారు కనుకే దైర్యంగా ఎమ్మెల్యేలను ఇంటింటికీ పంపుతున్నారు.
జగన్ జీవితం తెరచిన పుస్తకం. వైఎస్సార్సీపీ అంటే దేశంలోనే విలక్షణమైన
పార్టీగా నిలబడింది. ప్రజల నమ్మకాన్ని జగన్ ఏనాడూ వమ్ము చెయ్యలేదు. చాలా వరకూ
అధికార పార్టీలు ముందస్తు కోరుకుంటారు. కానీ మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు
కోరుకుంటున్నాయి. వెంటిలేటర్ పై ఉన్న పార్టీలు ముందస్తు ఎన్నికలు
కోరుకుంటున్నాయి. 2024లో షెడ్యుల్ ప్రకారమే రాష్టంలో ఎన్నికలు జరుగుతాయి.
పవన్-చంద్రబాబులు తమ అక్రమ సంబంధాన్ని పవిత్రం చెయ్యడానికి ప్రయత్నం
చేస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
పాదయాత్రలో వేల సమస్యలు జగన్ దృష్టికి వచ్చాయి. ప్రజా సమస్యలు తెలుసుకుని
మ్యానిఫెస్టోలో పెట్టాం. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నినాదం వచ్చిందని
స్పష్టం చేశారు.