ఈ వేసవికి ‘దసరా’తో ప్రేక్షకుల్ని పలకరించి
చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు కథానాయకుడు నాని, ఇప్పుడాయన కొత్త
దర్శకుడు శౌర్యువ్ తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ చెరుకూరి,
తీగల విజయేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మృణాల్
ఠాకూర్ కథానాయిక. ఈ సినిమాకి ‘హాయ్ నాన్న’ అనే పేరు ఖరారు చేశారు. ఇది తెలుగు,
తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఇదే పేరుతో రానుండగా హిందీలో మాత్రం ‘హాయ్ పాపా’
పేరుతో విడుదల కానుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్, గ్లింప్స్ ను గురువారం విడుదల
చేశారు. ఆ ప్రచార చిత్రంలో ఓ పాప స్నేహితురాలిగా మృణాల్ పరిచయం కాగా.. ఆఖర్లో
ఆ పాప “మా నాన్న” అంటూ నానిని పరిచయం చేయడం కనిపించింది. చివర్లో మృణాల్ తనని
తాను పరిచయం చేసుకుంటూ నాని ‘ “హాయ్ నాన్న” అని పిలవడంతో గ్లింప్స్ ముగిసింది.
ఈ గ్లింప్స్ కు హేషామ్ వహాబ్ నేపథ్య సంగీతం, సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం
అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి..
తండ్రీకూతుళ్ల అనుబంధాల నేపథ్యంలో సినిమా రూపొందుతున్నట్లు అర్ధమవుతోంది.
వినూత్నమైన కథాంశంతో పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం
డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి కూర్పు: ప్రవీణ్ ఆంటోని,
ఛాయాగ్రహణం: సాను జాన్ వర్గీస్.