నవంబర్ పదో తేదీ గురువారం హృతిక్ రోషన్ సోదరి పష్మీనా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా హృతిక్ స్నేహితురాలు సబా ఆజాద్ సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. షష్మీనా పుట్టినరోజు ఆమె ఫోటోను షేర్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో కొటేషన్లతో పోస్ట్ చేసింది. “మధురమైన సూర్యకాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు, పరిశుభ్రమైన అత్యంత అందమైన హృదయంతో నిండిన నీకు జన్మదిన శుభాకాంక్షలు” అంటూ పోస్టింగ్ చేసింది. తర్వాత రెండోసారి కూడా ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్టు ఉంచింది. “ప్రపంచంలో మీరు నిజమైన రత్నం..! మీకు మీరుగా ఉండండి!! ఇది ఉత్తమమైనది” అంటూ ఆమె మరో ఫోటోను షేర్ చేసి “ఆఫ్ ఎంత అందం. నా అందమైన పష్మీనా రోషన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని రాసింది.