అమరావతి : తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపుడి అనితకు హైకోర్టులో ఊరట
లభించింది. అనితపై నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం
ఆదేశించింది. తనపై అసభ్యకర పోస్టింగ్లు పెట్టారంటూ నందిగామకు చెందిన సజ్జన
రావు ఇంటి ముందు అనిత ఆధ్వర్యంలో తెలుగు మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనపై
పోలీసులు నాన్ బెయిల్బుల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై అనిత ధర్మాసనాన్ని
ఆశ్రయించారు. అనిత తరపున న్యాయవాది వీవీ. సతీష్ వాదనలు వినిపించారు. విచారణ
అనంతరం అనితపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు సూచించింది. 41
సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.