పోర్ట్ ఔ ప్రిన్స్: హైతీలోని దక్షిణ ప్రాంతంలో మంగళవారం వేకువజామున 4.9
తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ప్రకంపనల తీవ్రత కారణంగా ఇళ్లు కూలిన
ఘటనల్లో నలుగురు మరణించారని, 36 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
హైతీలోని దక్షిణ ప్రాంతంలో మంగళవారం వేకువజామున 4.9 తీవ్రతతో కూడిన భూకంపం
సంభవించింది. ప్రకంపనల తీవ్రత కారణంగా ఇళ్లు కూలిన ఘటనల్లో నలుగురు
మరణించారని, 36 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. భూకంపం సమయంలో తీవ్ర
భయాందోళనలకు లోనైన అనేక మంది చిన్నారులు అటూఇటూ పరిగెడుతూ తీవ్రంగా
గాయపడ్డారని, వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. నైరుతి తీరప్రాంత నగరమైన
జెరెమీకి సమీపంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు
అమెరికా భూవిజ్ఞాన పరిశీలన సంస్థ తెలిపింది.