హైదరాబాద్ : తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
హైదరాబాద్ లో సమావేశమైయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై
చర్చించే అవకాశం ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతంపై
చర్చించనున్నట్లు తెలుస్తోంది. రోడ్డుషోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్-1పైనా చర్చించే అవకాశం ఉంది. ఇటీవల కుప్పం
పర్యటనకు వెళ్లిన చంద్రబాబును పోలీసులు అడుగడుగునా అడ్డగించారు. రోడ్డుషోలకు
అనుమతి లేదంటూ ఆపేశారు. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ ప్రతిపక్షాల పట్ల
ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో కుప్పం పర్యటన
సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపైనా చర్చిస్తారని సమాచారం. గతంలో
విజయవాడలో సమావేశమైన ఇరువురు నేతలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్యంగా
పోరాడాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి
పనిచేస్తాయని ఇప్పటికే ప్రచారం జరుగుతుండటంతో చంద్రబాబు, పవన్ తాజా సమావేశం
ప్రాధాన్యం సంతరించుకుంది.