హైదరాబాద్ : ఫార్ములా రేసింగ్, ఈ పేరు వినగానే చాలా మందికి బుల్లెట్లా
దూసుకపోయే కార్లు, వేగంలోను అదుపు తప్పకుండా మలుపులు తిరిగే విన్యాసాలు
గుర్తుకొస్తాయి. ఇన్నాళ్లు టీవీల్లో చూసి ఆనందించిన ఫార్ములా రేసింగ్‌లు నేటి
నుంచి హైదరాబాద్‌లోనే జరుగనున్నాయి. ‘ఫార్ములా-ఈ’ రేస్ అంతర్జాతీయ పోటీలతో
హుస్సేన్‌సాగర్ తీరం అలరించనుంది.ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూసే ‘ఫార్ములా-ఈ’ రేసు నేడు ప్రాక్టీస్ మ్యాచ్‌తో
ప్రారంభం కానుంది. ఇప్పటివరకు విదేశాల్లో చూసే ఆ రేస్‌లు తిలకించే అవకాశం
నగరవాసులకు లభించనుంది. హుస్సేన్‌సాగర్ తీరాన జరిగే అంతర్జాతీయ పోటీల కోసం
2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌ను తీర్చిదిద్దారు. లుంబినిపార్కు నుంచి
ప్రారంభమై సచివాలయం పక్క నుంచి మింట్ కాంపౌండ్, ఐమాక్స్ మీదుగా ఎన్టీఆర్
గార్డెన్ వరకు రేస్ సాగనుంది. మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన
ఎలక్ట్రిక్ కార్లు పాల్గొనేపోటీలో. 22మంది రేసర్లు సత్తాచాటనున్నారు. రక్షణ
చర్యల్లో భాగంగా స్ట్రీట్ సర్క్యూట్‌కి ఇరువైపులా పెద్ద ఎత్తున బారికేడ్లు,
ప్రేక్షకుల గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4.30 గంటలకు తొలి ప్రాక్టీస్
రేస్ జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు రెండో ప్రీ ప్రాక్టీస్
రేస్, ఉదయం 10 గంటల 40 నిమిషాలకు అర్హత పోటీలు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన
రేస్ ఉంటుంది. ఇప్పటికే వివిధ దేశాల డ్రైవర్లు ట్రాక్‌ను పరిశీలించారు.
ఐఆర్ఎల్ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న నిర్వాహకులు..

17 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేసిన అధికారులు
సికింద్రాబాద్- ట్యాంక్‌బండ్ వైపు మార్గాన్ని మూసివేయనున్నారు. ట్రాఫిక్
నియంత్రణకు అదనంగా 600 మందిని మోహరించనున్నారు. రేసింగ్ పోటీలకు వచ్చే దేశ,
విదేశీ పర్యాటకుల కోసం 7 కోట్లతో హుస్సేన్‌సాగర్‌లో నీటిపై తేలే మ్యూజికల్
ఫౌంటేయిన్, లేజర్ షో ఏర్పాటు చేశారు. సాయంత్రం 7నుంచి 9 వరకు సాగే లేజర్
షోలో హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయ ఘట్టాలను ప్రదర్శిస్తారు.