కొవ్వూరు : ఆంధ్రప్రదేశ్ జోన్-2 (నూతన 7 జిల్లాల) పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ
జి. నాగమణి రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి
వనితను మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం హోం మంత్రి క్యాంపు కార్యాలయంలో
మంత్రిని కలసి పుష్పగుచ్చం అందించారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో
అమలవుతున్న విద్యా సంస్కరణల పై కాసేపు ఇరువురు చర్చించారు. వేసవి సెలవుల
అనంతరం స్కూల్స్ రీ ఓపెన్, బడులు తెరిచిన తొలి రోజు నుండే జగనన్న విద్యా కానుక
కిట్ల పంపిణీ తదితర అంశాలపై హోం మంత్రి తానేటి వనితను ఆర్జేడీ నాగమణి కలిసి
మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎం.
తిరుమల దాస్ పాల్గొన్నారు.