కొవ్వూరు : ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కు ఐదేళ్లు పూర్తి కావడంతో కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరులో ఘనంగా సంబరాలు చేశారు. హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. హోంమంత్రి చేతుల మీదుగా కేకును కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జగనన్న ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే అప్పుడు ఇచ్చిన హామీలను దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 99.9 శాతం అమలు చేయడం జరిగిందన్నారు. అలాంటి ప్రజాసేవకుడుని ప్రతి ఒక్కరు ఆదరించి వచ్చే ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు ముందుడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్పీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.