కొవ్వూరు: కొవ్వూరు లోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ
వేడుకలు ఘనంగా జరిగాయి. హోం, విపత్తు నిర్వహణ శాఖ మాత్యులు డా.తానేటి వనిత
జాతీయ జెండా ఎగురవేసి రాష్ట్ర ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ వైస్సార్సీపీ సీనియర్ నాయకులు,
మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వైస్సార్సీపీ నాయకులకు,
సిబ్బందికి స్వీట్స్ పంచి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత
రాజ్యాంగాన్ని జనవరి 26 న ఆమోదించిన సంధర్భంగా ప్రతి ఏటా ఘనంగా గణతంత్ర
దినోత్సవ వేడుకలు జరుపుతున్నామని హోంమంత్రి వనిత తెలిపారు. భారత దేశానికి
స్వాతంత్య్రం వచ్చిన తరువాత మనకంటూ ఒక రాజ్యాంగ అవసరమని డా.బిఆర్.అంబేద్కర్
ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటయిందన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను
పరిశీలించి, భారత పౌరులందరికీ సమన్యాయం కల్పించే విధంగా రాజ్యాంగాన్ని
రూపొందించారు. ప్రపంచంలోనే అది పెద్ద లిఖితపూర్వక రాజ్యాంగంగా మన దేశానికి
పేరు వచ్చిందని హోంమంత్రి తానేటి వనిత గారు తెలిపారు. ప్రతి భారత పౌరుడికి
స్వేచ్చ, స్వతంత్రాలను, హక్కులను, విధులను మన రాజ్యాంగం కల్పించింది. ఇంత
పెద్ద భారత దేశంలో ప్రజలందరూ స్వేచ్ఛగా, స్వాతంత్రంగా జీవించగలుగుతున్నామంటే
అది డా.బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క గొప్పతనమన్నారు. భారత
ప్రజలందరూ రాజ్యాంగం యొక్క గొప్ప తనాన్ని, విలువను తెలుసుకొని మంచి నడవడికతో
జీవించాలని హోం మినిస్టర్ తానేటి వనిత సూచించారు.