కొవ్వూరు : మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని కొవ్వూరు లోని
హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక
వైస్సార్సీపీ నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి
తానేటి వనిత జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
స్త్రీ విద్యను ప్రోత్సహించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే ని హోం మంత్రి
తానేటి వనిత కొనియాడారు. పూలే ఆశయాలకు అనుగుణంగా, మహిళా సాధికారత ను
ప్రోత్సహిస్తున్న వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. దేశంలో ఏ
నాయకుడు చేయని విధంగా మహిళలకు 50 శాతం నామినేటెడ్ పదవులిచ్చి గౌరవించారని
తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానాల్లో
నిలబెట్టిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్లు,
నామినేటెడ్ పదవులు, వాలంటరీ ఉద్యోగాలలో 50 శాతం మహిళలకు కల్పించారని
పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకంలోనూ మహిళలను
భాగస్వామ్యం చేసి గౌరవిస్తున్న ఘనత సీఎం కే దక్కుతుందని హోంమంత్రి తానేటి వనిత
స్పష్టంచేశారు.