కొవ్వూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా కమిటీలో నూతనంగా
పదవులు పొందిన పలువురు నాయకులు రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ
మంత్రి డాక్టర్ తానేటి వనితను మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం హోంమంత్రి
క్యాంపు కార్యాలయంలో ఆమె కలిసి పుష్పగుచ్చాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా పార్టీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన గండ్రోతు
సురేంద్ర కుమార్, సెక్రటరీగా నియామకమైన ముదునూరి సూర్యనారాయణ రాజు నాయకులతో
కలిసి హోంమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత
మాట్లాడుతూ కష్టపడిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందన్నారు. పదవులు
వచ్చినవారు మరింత బాధ్యతతో కష్టపడి పనిచేయాలని ఆమె సూచించారు. రాష్ట్ర
ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల
మేరకు తూర్పు గోదావరి జిల్లా పార్టీ కమిటీని నియమించడం జరిగింది. 55 మందితో
కూడిన తూర్పు గోదావరి జిల్లా పార్టీ కమిటీలో కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన
ఒక వైస్ ఛైర్మన్, సెక్రటరీ, ఐదు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మొత్తం ఏడు పదవులు
దక్కాయి.