కొవ్వూరు : కొవ్వూరులో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడం, నియోజకవర్గ
అభివృద్ధికి సీఎం హామీలు ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ స్థానిక ప్రజా
ప్రతినిధులు, వివిధ సామాజిక వర్గాల నాయకులు హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ
మంత్రి తానేటి వనితను కలిసి అభినందనలు తెలిపారు. కొవ్వూరు మున్సిపల్ చైర్మన్,
కౌన్సిలర్లు, కాపు సామాజిక వర్గ నాయకులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. హోం
మంత్రి తానేటి వనిత విజ్ఞప్తి మేరకు డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రూ.30
కోట్లతో పాటు 3 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, కొవ్వాడ కెనాల్ వద్ద కల్వర్ట్, మూడు
మండలాల్లో మూడు అంబేడ్కర్ భవనాలు, ముస్లింలకు షాదీఖానా, ఎస్సీలకు కమ్యూనిటీ
హాలు, కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భావన రత్నకుమారి, కౌన్సిలర్లు, నియోజక వర్గ
సీనియర్ కాపు నాయకులు తదితరులు పాల్గొన్నారు.