విజయవాడ : ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు, పూజ్యులు శ్రీ శ్రీ శ్రీ
ఆత్మానందమయి అమ్మగారు స్వయంగా అనుగ్రహిస్తున్న సుషుమ్న క్రియా యోగ దీక్షా
కార్యక్రమం, విజయవాడలో జనవరి 1వ తేది ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ఏ
కన్వెన్షన్ సెంటర్ లబ్బీపేటలో జరగనుంది. ఈ విషయాన్ని ప్రెస్ క్లబ్ లో జరిగిన
విలేకరుల సమావేశంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి. విజయ బాబు తెలిపారు. ఈ
కార్యక్రమం దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
నిర్వహించబడుతుంది. సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా
సంస్థ.
పూజ్యశ్రీ అత్మానందమయి అమ్మగారు సుషుమ్న క్రియా యోగ సాధనకు సంబంధించిన అనేక
సూక్ష్మాలను ఈ కార్యక్రమంలో తెలియజేస్తారు. ఒత్తిడిని తట్టుకోగల శక్తి,
నైపుణ్యం, మానసిక ప్రశాంతతను కలుగజేసే చాలా ప్రభావంతమైన ప్రక్రియ ఈ సాధన.
సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా శారీరక, మానసిక, భావపూర్ణ, సామాజిక,
ఆధ్యాత్మిక స్వస్థతను సాధించవచ్చు. సుషుమ్న క్రియా యోగ అంతర్ చైతన్యాన్ని,
ఉత్సాహాన్ని, ప్రేరణను, అందించటంతో పాటు, ఆరోగ్యవంతమైన జీవనానికి నాంది
పలుకుతుంది. ఒత్తిడిని నివారించి, సామర్థ్యాన్ని, నేర్పును పెంపొందిస్తుంది.
ప్రతి ఒక్కరు ఎంతో సులభంగా సాధన చేయగల మహత్తర ప్రక్రియ ఇది. ఎంతో మంది
ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ కార్యక్రమానికి అందరికీ ఉచిత
ప్రవేశం. విలేకరుల సమావేశంలో దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ తరఫున
అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు, ఫౌండేషన్ మెంబెర్ రుద్రరాజు
శిరీష దేవి, ఫౌండేషన్ వాలంటీర్స్ భాస్కర్ రావు, అనిల్ కుమార్, శృతకీర్తి
జొన్నాలగడ్డ పాల్గొన్నారు.