అమరావతి : 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్ ప్రభుత్వం
చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు
చేసింది. ఈ అంబులెన్స్‌లను సోమవారం సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్
కార్యాలయం వద్ద ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం అయిన 108
వ్యవస్థను బలోపేతం చేస్తూ 2020లోనే మండలానికి ఒక 108 అంబులెన్స్‌ను సమకూర్చిన
విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అప్పట్లో రూ.96.50 కోట్లతో అధునాతన సౌకర్యాలతో
412 కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేసి, అప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు చేసి
748 అంబులెన్స్‌లతో సేవలను విస్తరించారు. గత అక్టోబర్‌లో రాష్ట్రంలోని గిరిజన
ప్రాంతాల ప్రజల కోసం రూ.4.76 కోట్లతో ప్రత్యేకంగా 20 అదనపు అంబులెన్సులు
కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది.