ప్రకటిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. ఏఐసీసీ
చీఫ్ ఖర్గే సమక్షంలో రేవంత్ దళిత డిక్లరేషన్ ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా
చేవెళ్ల కేవీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభకు
పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తొలుత గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి
నివాళులర్పించారు. ఖర్గే సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కార్యకర్తలు భారీగా రావడంతో చేవెళ్ల-శంకర్పల్లి వెళ్లే మార్గంలో కిలోమీటర్ల
మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా
గాంధీ సూచన మేరకు ఎస్సీ, ఎస్టీ డిక్లకేషన్ ప్రకటిస్తున్నట్టు చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో ప్రకటించిన అంశాలివే
అంబేడ్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12లక్షలు ఇస్తాం.
కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం. ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12
శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తాం.
పోడు భూములకు పట్టాలిస్తాం. ఎస్సీ, ఎస్టీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.6లక్షలు ఇస్తాం.
రాష్ట్రంలో కొత్తగా 5 ఐటీడీఏలు, 9 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు
చేస్తాం.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే రూ.10వేలు, డిగ్రీ పాస్
అయితే రూ.25వేలు, పీజీ పూర్తి చేస్తే రూ.లక్ష, పీహెచ్డీ, ఎంఫిల్ పూర్తి
చేసిన వారికి రూ.5 లక్షలు ఇస్తాం.
ప్రతి మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తాం.
గ్రాడ్యుయేషన్, పీజీ చదివే ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు వసతి కల్పిస్తాం.
జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు పెంచుతాం.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే కంపెనీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
కల్పిస్తాం.
ప్రతి తండా గ్రామపంచాయతీకి ఏటా రూ.20 లక్షలు, ఎస్సీ కార్పొరేషన్లకు రూ.750
కోట్లు, ఎస్టీ కార్పొరేషన్లకు రూ.500 కోట్లు ఇస్తాం.
విదేశీ వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక సాయం చేస్తాం.