డక్కిలి: వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : 13వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు డక్కిలి మండలంలోని వైకాపా పార్టీ కార్యకర్తలు నాయకులకు ప్రత్యేక రాజకీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తిరుపతి జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నట్లు జె సి ఎస్ మండల ఇన్చార్జి చింతల శ్రీనివాసురెడ్డి అధ్యక్షతన ఆదివారం సాయంత్రం డక్కిలి పార్టీ కార్యాలయంలో సమావేశం కావడం జరిగింది. మంగళవారం జరిగే విస్తృత స్థాయి సమావేశంకు ప్రతి ఒక నాయకులు కార్యకర్తలు తప్పక హాజరు కావాలని ఒక ప్రకటన తెలియజేశారు. ఆదివారం జరిగిన సమావేశంలో వైకాపా మండల ప్రెసిడెంట్ పెట్లూరు జగన్మోహన్ రెడ్డి, దశరధ రామిరెడ్డి,నార్రవుల వేణుగోపాల్ నాయుడు , ఎమ్మెల్ నారాయణరెడ్డి, నావూరు కోటేశ్వరరావు, సామాది చెంచయ్య, ఆదిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి,మామిడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.