విజయవాడ : “ప్రపంచ రక్త దాత దినోత్సవం” సందర్భంగా స్వచ్చంద రక్త దాతలకు
ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఈనెల 13న మంగళవారం ఉదయం 11 గంటలకు సి.ఆర్
మీడియా అకాడమి కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస
రావు ఒక ప్రకటనలో తెలిపారు. రక్తదాతలకు అభినందనలు తెలిపేందుకు ఏర్పాటు
చేస్తున్న ఈ కార్యక్రమంలో మీడియా పాత్రికేయులతో పాటు ఎక్కువ సార్లు రక్త
దానాన్ని చేసి ఎంతో మందికి ప్రాణ దానం చేసిన పలు స్వఛ్ఛంద సంస్థల ప్రతినిధులను
సన్మానించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక అతిధులుగా బ్లడ్ బ్యాంక్స్ &
ప్రాజెక్ట్స్, రెడ్ క్రాస్ సొసైటీ ఎపి స్టేట్ కోఆర్డినేటర్ బి.వి.ఎస్. కుమార్,
మెడికల్ ఆఫీసర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, రిటైర్డ్ జిల్లా వైద్య ఆరోగ్య
అధికారి డా. టి.వి. రమణ రావు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్,
ప్రధాన కార్యదర్శి జి. అంజనేయులు పాల్గొంటారని చైర్మన్ తెలిపారు. పలువురు
స్వఛ్ఛంద రక్తదాతలు, మీడియా అకాడమి సెక్రటరీ మామిడి పల్లి బాలగంగాధర్ తిలక్ తో
పాటు తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో హాజరుకానున్నారని చైర్మన్ కొమ్మినేని
శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు.