శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 13 మందికి 13.57 లక్షల
రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్
పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పంపిణీ చేశారు. ఆంధ్ర
ప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ప్రతిష్టాత్మకంగా అమలుచేయడంతో పాటు పేద
మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం వైయస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఎన్నడూ లేని విధంగా ఉదారంగా ఆర్ధిక సహాయం
అందచేస్తున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి
గిరిధర్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా అనేక
వ్యాధులకు వైద్యం అందించడంతో పాటు, ప్రత్యేకంగా వైద్యం అవసరమైన వారికి
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నందుకు
ముఖ్యమంత్రికి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి
గిరిధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేదలకు మెరుగైన వైద్యం కోసం లక్షల కోట్ల రూపాయలను
కేటాయించిన ఘనత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిదే. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో
నెల్లూరు రూరల్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్, శ్రీ వేదగిరి
లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఛైర్మెన్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి,
దేవరపాలెం సర్పంచ్ అశోక్ రెడ్డి, మదరాజు గూడూరు సర్పంచ్ వెంకటేశ్వర్లు,
ఆమంచర్ల ఉపసర్పంచ్ మలినేని వేణు నాయుడు, 20వ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల
మహేష్, 24వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి, 26వ డివిజన్
అధ్యక్షులు బూడిద పురుషోత్తం యాదవ్, 28వ డివిజన్ అధ్యక్షులు చెక్క సాయి
సునీల్, వైసీపీ సీనియర్ నాయకులు మిద్దె మురళీ కృష్ణా యాదవ్, పుల్లారెడ్డి,
నగళ్ల రాము, పిగిలం నరేష్ తదితరులు పాల్గొన్నారు.