తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనంకు విచ్చేసే భక్తులకు చక్కటి అనుభూతి కలిగే
విధంగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియంను అధునాతన టెక్నాలజీని ఉపయోగించి
ఆధునీకరిస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
శుక్రవారం తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులకు ఆలయ అర్చకులు ప్రత్యేక
పూజలు నిర్వహించారు. అనంతరం టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ఈవో
ఏ.వి ధర్మారెడ్డి వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ శంకుస్ధాపన చేశారు.
అనంతరం ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులకు సంబంధించి టిటిడి అధికారులకు, టిసిఎస్
సంస్ధ ప్రతినిధులకు, మ్యాపింగ్ సిస్టం ప్రతినిధులకు పలు సూచనలు, సలహాలు
ఇచ్చారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో
మాట్లాడుతూ తిరుమల ఆలయ ప్రాతిశ్యంను ఎన్నో దశాబ్ధాలుగా భక్తులకు ప్రదర్శన
రూపంలో తిరుపతి, తిరుమలలో ఉన్నాయన్నారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అధునాతన
సౌకర్యాలతో కట్టబడిందని, మ్యూజియంకు మొదటి నుండి భక్తుల తాకిడి తక్కువగా
ఉందని, అందుకు ప్రధాన కారణం దైవ దర్శనంమే ప్రధానంమేనన్నారు. పురాతన కాలం నుండి
వస్తున్న ఆలయం యొక్క మార్పులు గురించి తెలుసుకునే ఆశక్తి లేక పోవడం కారణం గానే
ఎస్వీ మ్యూజియంకు భక్తుల తాకిడి తగ్గిందని, అందుకోసమే టిటిడి ఒక అధునాతనమైన
టెక్నాలజీని ఉపయోగించి, బెంగళూరుకు చేందిన టిసిఎస్, మ్యాప్ సిస్టమ్స్ సంస్ధలకు
చేందిన ఇరువురు కలిసి మ్యూజియం ఆధునీకరణకు సహకరిస్తున్నట్లు తెలిపారు. మొత్తం
145 కోట్ల రూపాయలతో ఎస్వీ మ్యూజియంను ఆధునీకరణ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో
125 కోట్లు టిసిఎస్, 20 కోట్లు మ్యాప్ సిస్టం వాళ్లు మ్యూజియం ఆధునీకరణకు
దాతలుగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. డిసెంబరులోగా ఆధునీకరణ పనులు పూర్తి
చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, మొత్తం మూడు ఫ్లోర్స్ గా మ్యూజియంను
నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కో ప్రత్యేకత
సంతరించుకుని, దేవాలయం సంబంధించిన ప్రతి విషయాన్ని పోగు చేసుకుని ప్రదర్శకులకు
ఆసక్తికరంగా తిలకించే విధంగా టెక్నాలజీని ఉపయోగించి ఆధునీకరిస్తున్నట్లు
తెలిపారు. ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్ లో తిరువీధులు, ఆలయ అనుభూతి, వాహన
సేవలు,స్వామి వారి సేవలు, సప్తగిరుల గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నాంమని, శ్రీ
వేంకటేశ్వర స్వామి వారి రాతి విగ్రహాలు, కాంస్య విగ్రహాలు, అన్నమయ్య రాగి
రేకులు, పురాతన నాణేల గ్యాలరీలను టిసిఎస్ సంస్ధ ఏర్పాటు చేస్తుందన్నారు.
శ్రీవారి ఆలయ శిల్పకళ వైభవం, భక్తాగ్రేసురులైన మహానుభావులు సేవలు, యుధ్దంలో
వాడిన పరికరాలు, సంగీత పరికరాలు, పూజా సామగ్రీ వంటి గ్యాలరీలు ఏర్పాటు
చేస్తున్నాంమని, రెండోవ ఫ్లోర్ లో విరాట్ పురుషుడైన బ్రహ్మ మహేశ్వరులు,
బుగ్వేదం, ఎదుర్వేదం వంటి గ్యాలరీలతో పాటుగా, మూడోవ ఫ్లోర్ లో బ్రహ్మాండ
గ్యాలరీ ఏర్పాటు చేస్తూ, మ్యూజియం పైగాంలో 17 పెద్ద గోపురాలు ఏర్పాటు
చేస్తున్నాంమని, అందులో అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, పురందరదాస,
మధ్వాచార్య వంటి భక్తాగ్రేసురులతో పాటు, రామాయణం, మహాభారతం వంటి అంశాల
ప్రదర్శన రూపంలో ఏర్పాటు చేస్తున్నాంమని, భక్తులందరికి ఒక గొప్ప ఆధ్యాత్మిక
అనుభుతితో పాటు, ఒక చక్కటి విజ్ఞానం కలిగేలా తిరుమలలో ఎస్వీ మ్యూజియంను
ఆధునీకరిస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.