తెనాలి : ప్రతిపక్షాల జెండా.. అజెండా గురించి అతిగా ఆలోచించడం మానేసి
ముఖ్యమంత్రి దమ్ము చూపుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్
నాదెండ్ల మనోహర్ సూచించారు. 175 కాకపోతే 500 స్థానాల్లో పోటీ చేసుకోవాలనీ,
ఓపిక ఉంటే పక్క రాష్ట్రాల్లోనూ పోటీ చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రికి దమ్ము
లేదు కాబట్టే వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి ప్రభుత్వ కార్యక్రమాలో రాజకీయ
కక్షలు రెచ్చేగొట్టే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రతి అంశంలోకీ ఐ
ప్యాక్ వాళ్ళని తీసుకువచ్చి ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థను నిర్మిస్తున్నారని
తెలిపారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే సామాన్య ప్రజల దగ్గరకు వచ్చి సమస్యలు
తెలుసుకోవాలని సవాలు చేశారు.
తెనాలిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్
మాట్లాడుతూ “ముఖ్యమంత్రి తెనాలి పర్యటన గురించి రాష్ట్రం మొత్తం ఎంతో ఆసక్తిగా
ఎందుకు చూసింది. ముఖ్యమంత్రి ఖచ్చితంగా నియోజకవర్గానికి పనికి వచ్చే విధంగా
అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటిస్తారని ప్రజలు భావించారు. చిరు వ్యాపారులు,
సామాన్యులు పర్యటించే రహదారిపై సీఎం పర్యటిస్తే మార్పు వస్తుందని తెనాలి
ప్రజలు ఎదురు చూశారు. ముఖ్యమంత్రి హడావిడిగా హెలికాప్టర్లో వచ్చి
వెళ్లిపోయారు.
ముఖ్యమంత్రి చేసిన ప్రకటనల్లో ఎన్ని నెరవేర్చారో చెప్పాలి : ప్రజల్లో
ముఖ్యమంత్రికి నిజంగా ఆదరణ ఉంటే 151 స్థానాల్లో గెలిపించారుగా. ఆయన్ని
చూసేందుకు, ఏం చెబుతారో వినేందుకు సహజంగానే జనం రావాలి. ఆయన దుమ్ము లేపుకుంటూ
హెలికాప్టర్లో వచ్చి భద్రతా కారణాల పేరుతో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే
విధంగా వచ్చి వెళ్లారు. వాలంటీర్లను పెట్టి జనాన్ని బెదిరించి మరీ తరలించారు.
ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలను బెదిరించి స్కూళ్లు మూసివేయించి మరీ బస్సులు
పెట్టి తీసుకువచ్చారు. చివరికి సీఎం ఏం చెబుతారో వినకుండానే వృద్ధులతో సహా
అంతా గోడదూకి వెళ్లిపోయిన పరిస్థితి. ఆయనేమో దమ్ముంటే రండి.. దమ్ముంటే రండి
అంటారు. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే సామాన్య ప్రజల దగ్గరికి వచ్చి వారితో
మాట్లాడాలి. సమస్యల మీద వినతులు తీసుకోవాలి. ఎందుకు ఎవరికీ కనబడకుండా
హడావిడిగా వచ్చి వెళ్లిపోతారు. ముఖ్యమంత్రి పర్యటన ఉంది అంటే ఒక కసరత్తు
జరగాలి.
తెలంగాణలో కూడా వైసీపీ ఆఫీస్ ఉంది కదా : ఓటమి భయంలో సహనం కోల్పోయి ఆలోచనా
విధానం మార్చేసుకుని ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే ఈ ముఖ్యమంత్రి
ఎందుకు? జనసేన నాయకులు స్థానిక సమస్యల మీద శాంతియుతంగా మెమోరాండం
ఇద్దామనుకుంటే ఉదయం ఆరు గంటలకే ఇళ్లకు వచ్చి అరెస్టులు చేశారు. అక్రమంగా
నిర్భంధించారు. ముఖ్యమంత్రి ఉపన్యాసం వాస్తవానికి విరుద్దంగా ఉంది. మాట్లాడితే
175కి 175 పోటీ చేసి గెలుస్తామంటారు? 175 కాకపోతే 500 పోటీ చేసుకోండి.