ఇష్టం’ సినిమాతో టాలీవుడ్ ప్రవేశం చేసిన శ్రియ శరణ్ ఈ 20 ఏళ్లలో తెలుగులో
ఎన్నో చిత్రాల్లో నటించింది. చాలా హిట్లు ఖాతాలో వేసుకుంది. కెరీర్
ప్రారంభించిన తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మారిన ఆమె యువ నటులతో పాటు
బడా హీరోలతోనూ నటించింది. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. 2003లో వచ్చిన
బ్లాక్ బస్టర్ ఠాగూర్ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా నటించింది. వయసు
పెరుగుతున్నా తన అందాన్ని కాపాడుకుంటూ రెండు దశాబ్దాలుగా నటన కొనసాగిస్తున్న
శ్రియ ఇప్పుడు మరోసారి చిరుతో స్టెప్పులు వేయనుంది.చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తీస్తున్న ‘భోళా శంకర్’ చిత్రంలోని ఐటం సాంగ్
కోసం శ్రియను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చాలా మందిని సంప్రదించిన తర్వాత
చిరుతో పోటాపోటీగా నర్తించేది శ్రియనే అని చిత్ర బృందం నిర్ణయానికి వచ్చిందని
వినికిడి. ఈ ఆఫర్ కు వెంటనే ఒప్పుకున్న శ్రియ చిరుతో కాలు కదపడానికి రెడీ
అయినట్టు తెలుస్తోంది.
పలు చిత్రాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో స్పెషల్ సాంగ్స్ చేసిన శ్రియతో
మెగాస్టార్ తో స్పెషల్ నంబర్ మరింత ప్రత్యేకంగా ఉండనుంది. ఈ పాట కోసం శ్రియా
రూ. కోటి పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది