చేయాలి
విజయసాయిరెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ సిపి అనుబంధ విభాగాల సమావేశం
నాలుగు అంశాలపై ప్రధానంగా చర్చ
గుంటూరు : తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన
కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇంచార్జ్ విజయసాయిరెడ్డి అధ్యక్షతన మంగళవారం
అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం జరిగింది. ముందుగా ఇటివల ఒడిశాలో జరిగిన
రైలు ప్రమాదంలో మృతిచెందిన వారికి ఈ సమావేశంలో నివాళులు అర్పించారు. ఈ
సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించారు. అనుబంధ విభాగాలలో ఖాళీగా ఉన్న
పదవులను త్వరితగతిన భర్తీ చేయాలని తీర్మానించారు. అలాగే గతంలో పార్డీ
నిర్వహించిన జయహో బీసీ సమావేశం మాదిరిగా ఎస్సీ,ఎస్టీ, ముస్లిం మైనారిటీ
సమావేశాలు రాష్ట్ర స్ధాయిలో నిర్వహణపై కూడా చర్చ జరిగింది. వివిధ సామాజిక
వర్గాలకు, విభాగాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు, కార్యక్రమాలు
ఇంటింటికీ ప్రచారం చేయాలన్న దాని మీద చర్చించారు. అలాగే అనుబంధ విభాగాల
అధ్యక్షులకు అధనంగా మరికొంత మందిని నియమించడంలో సాధ్యాసాధ్యాలపై ఈ
సమావేశమంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అనుబంధ విభాగాల అధ్యక్షులు
విజయసాయిరెడ్డి కి ఈ నాలుగు అంశాలతో పాటు వివిధ అంశాలపై సలహాలు, సూచనలను
చేశారు.
అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలకు
ముందు గెలుపు కోసం అనుబంధ విభాగాలు పార్టీ కోసం ఎలా పని చేశాయో, అలాగే 2024
గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అనుబంధ విభాగాల
అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలన్నారు. త్వరితగతిన
పార్టీ అనుబంధ విభాగాల జోనల్ ఇంచార్జీలు, జిల్లా ప్రెసిడెంట్స్, మండల
ఇంచార్జిల ఖాళీలను ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుని అనుబంధ
విభాగాల అధ్యక్షులు భర్తీ చేయాలన్నారు. జయహో బిసి మహాసభ ఎలా అయితే
విజయవంతమైందో త్వరలో పార్టీ తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ ,ముస్లిం మైనారిటీ,
మహాసభలు విజయవంతం అయ్యేలా అనుబంధ విభాగాల అధ్యక్షులు కృషి చేయాలనీ కోరారు.
ఏదైనా సమస్యలుంటే అనుబంధ విభాగాల అధ్యక్షులు తన దృష్టికి తీసుకురావాలని
విజయసాయిరెడ్డి కోరారు. ఈ సమావేశానికి పార్టీ కేంద్ర కార్యాలయ ఇంచార్జ్,
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల కో–ఆర్డినేటర్‌గా
చెవిరెడ్డి, అన్ని అనుబంధ విభాగాల ఇంచార్జిలు పాల్గొన్నారు.