మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కమల్నాథ్ తాజాగా
సంచలన వ్యాఖ్యలు చేశారు.2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి
రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ నాయకుడు కమల్నాథ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ
ఇంటర్వ్యూలో కమల్ నాథ్ మాట్లాడుతూ.. 2024 లోక్సభ ఎన్నికల గురించి ఆలోచిస్తే
రాహుల్ ప్రతిపక్ష నాయకుడు మాత్రమే కాకుండా ప్రధాని అభ్యర్థి కూడా అని చెప్పారు.భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ కి ప్రజలు నీరాజనాలు పడుతున్నారని అన్నారు.
ఇంత సుదీర్ఘమైన పాదయాత్రను ఎవరూ చేపట్టలేదని అన్నారు. రాహుల్ గాంధీ అధికారం
కోసం కాకుండా దేశ ప్రజల కోసమే రాజకీయాల్లో ఉన్నారని అన్నారు. గాంధీ కుటుంబం
తప్ప మరే కుటుంబం దేశం కోసం ఇన్ని త్యాగాలు చేయలేదని కాంగ్రెస్ నేత
వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత
పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని కమల్ నాథ్ ప్రకటించారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సంస్థాగత మార్పులకు శ్రీకారం
చుట్టనున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది చివర్లో మధ్యప్రదేశ్లో ఎన్నికలు
జరగనుండగా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.