కొలంబో : శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఈ నెల 21 నుంచి రెండు రోజుల
పాటు భారత్లో పర్యటించనున్నారు. గతేడాది జులైలో జరిగిన ప్రజా తిరుగుబాటు
అనంతరం అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే పదవీ నుంచి తప్పుకున్న అనంతరం
విక్రమసింఘే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా నియమితులైన
తర్వాత తొలిసారిగా ఆయన భారత్లో పర్యటించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. విద్యుత్తు, ఇంధనం,
వ్యవసాయం, నౌకాయానం తదితర అంశాలపై చర్చలు జరుపుతారు. అధ్యక్షుడితో పాటు
శ్రీలంక మత్స్యశాఖ మంత్రి డగ్లస్ దేవానంద, విద్యుత్తు, ఇంధన శాఖ మంత్రి
విజేశేఖర్, విదేశాంగ మంత్రి అలీ సబ్రీలు భారత్లో పర్యటిస్తారు.