ముంబయి : మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్
సమ్మిట్‌పై ముంబైలో పరిశ్రమల శాఖ రోడ్ షో నిర్వహించింది. మంత్రులు బుగ్గన,
జి.అమర్నాథ్, ఆదిమూలపు సురేష్ పరిశ్రమల శాఖ అధికారులు హాజరై.. కొత్త
పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు వివరించారు. మార్చి 3, 4
తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌పై ముంబైలో పరిశ్రమల
శాఖ రోడ్ షో నిర్వహించింది. మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, గుడివాడ
అమర్నాథ్, ఆదిమూలపు సురేష్ పరిశ్రమల శాఖ అధికారులు హాజరై కొత్త పారిశ్రామిక
విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు భూ
లభ్యత, వనరులు, 21 రోజుల్లోనే అనుమతులు తదితర అంశాలను ముంబైలోని
పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు.
కాస్మొపాలిటన్ నగరంగా విశాఖలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నట్టుగా
అధికారులు వివరించారు. మరోవైపు వివాదాస్పద ప్రశ్నలు సమాధానాలు రాకుండా
ప్రభుత్వం మంత్రి ప్రసంగం ముగిసిన వెంటనే ప్రశ్నలు సమాధానాల కార్యక్రమం లైవ్
లింక్‌ను తొలగించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకేచోట పరిశ్రమల్ని గుమ్మరించారని ఏపీ ఆర్థిక శాఖ
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముంబైలో ఏపీ పరిశ్రమల శాఖ
నిర్వహిస్తున్న రోడ్ షోకు హాజరైన మంత్రి విభజన తర్వాత ఏపీ పారిశ్రామికంగా
ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో అందుకే
పోర్టులు, రహదారులు, రైల్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాలకు చుట్టుపక్కలే ఏపీలోని
నగరాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వాటికి ఆనుకునే పరిశ్రమలకు కేటాయించేలా
భూములు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ నగరాలకు అనుసంధానమైన పోర్టుల
ద్వారా తూర్పు ఆసియా దేశాలతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చన్నారు.
ప్రస్తుతం ఏపీలో సుస్థిరమైన రాజకీయ నేపథ్యం ఉన్న ప్రభుత్వం ఉందని, తద్వారా
సుస్థిరమైన విధానాలతో పెట్టుబడులకు అనుకూలమని మంత్రి పదేపదే పెట్టుబడి దారులకు
వివరించారు. మెడ్ టెక్ జోన్ లాంటి వైద్య పరికరాల జోన్, పెట్రో కెమికల్
కారిడార్ లాంటి పారిశ్రామిక అనుకూల వ్యవస్థలూ ఉన్నట్టు మంత్రి వివరించారు.
కియా, ఇసుజూ, అశోక్ లేలాండ్ లాంటి ఆటోమైబైల్ సంస్థలు ఏపీలో ఉన్నాయని, ఏపీలో
ప్రతీ సెకెన్ వ్యవధిలో ఓ సెల్‌ఫోన్ తయారు అవుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 888
కిలోమీటర్ల జాతీయ జలరవాణా మార్గం అందుబాటులో ఉంది. 2029 నాటికి 10 మిలియన్
టన్నుల సరకు జలరవాణా మార్గాల్లో జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అన్ని
ప్రాంతాల్లోనూ సమతుల అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. విశాఖ
లాంటి అందమైన, కాస్మొపాలిటన్ నగరానికి పెట్టుబడులతో రావాలని కోరుతున్నామని ఏపీ
ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.