హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హుస్సేన్‌సాగర్ ఒడ్డున రాష్ట్ర
ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘తెలంగాణ అమరుల స్మారక చిహ్నం’
ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల
ప్రశాంత్‌రెడ్డి సమీక్షించారు. ఈ నెల 22న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల
ముగింపు రోజున స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారని మంత్రి
తెలిపారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమం నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై అధికారులకు
మంత్రి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, డీజీపీ
అంజనీకుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్ అండ్ బీ ప్రత్యేక
కార్యదర్శి విజయేంద్ర బోయి, ఈఎన్సీ గణపతిరెడ్డి, సమాచార ప్రజా సంబంధాలశాఖ
ప్రత్యేక కమిషనర్ కె.అశోక్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.