వైఎస్ ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం : వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని ఈనెల 23న
నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
తెలిపారు. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం దరి అంబేడ్కర్ ఆడిటోరియంలో
మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే ఈ సమావేశానికి జిల్లాలోని శాసనసభ్యులు, జెడ్పీ
చైర్ పర్సన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు,
డైరెక్టర్లు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు,
జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు అందరూ హాజరు కావాలని పేర్కొన్నారు. ముఖ్య
పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మంగళవారం మధ్యాహ్నం అంబేద్కర్ ఆడిటోరియం
పరిశీలించారు. ఆయన వెంట డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వర రావు, బీసి
కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబు, ఎంవి పద్మావతి,
చల్లా అలివేలు మంగ, వర్కింగ్ ప్రెసిడెంట్ శిమ్మ రాజశేఖర్, అందవరపు రమేష్,
మూకళ్ళ తాతబాబు, ఎన్ని ధనుంజయ రావు, సుగుణ రెడ్డి, మహమ్మద్ సిరాజుద్దీన్
తదితరులు ఉన్నారు.