విజయవాడ : పోలవరం ముంపు ప్రభావంపై ఈ నెల 25న కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ
లో సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహించనుంది. సాంకేతిక కమిటీలోని సభ్యులైన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు
చెందిన ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు హాజరుకానున్నారు. సమావేశానికి సంబంధించిన
సమాచారాన్ని మంగళవారం సీడబ్ల్యూసీ రాష్ట్రాలకు పంపించింది. 13న జరగాల్సిన ఈ
సమావేశం వాయిదాపడిన విషయం తెలిసిందే.ట్రైబ్యునల్ విచారణ వాయిదా : కృష్ణా జల వివాదాలపై ఈ నెల 24, 25 తేదీల్లో
జరగనున్న ట్రైబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-2) విచారణ వాయిదాపడింది. ఏపీ, తెలంగాణ
రాష్ట్రాల మధ్య జలవివాదాలపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణ
పూర్తికాగానే ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో తెలంగాణ తరఫు సాక్షి చేతన్ పండిట్‌ను
ఏపీ న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది. విచారణ వాయిదాపడిన
నేపథ్యంలో క్రాస్ ఎగ్జామినేషన్ తేదీలు కూడా మారనున్నాయి. వచ్చే నెల మూడో
వారంలో తిరిగి విచారణ ఉండొచ్చని నీటిపారుదల శాఖ భావిస్తోంది.