1997 తర్వాత ఈజిప్టులో అడుగుపెట్టిన భారత ప్రధాని
రెండు రోజుల పాటు కొనసాగనున్న మోడీ పర్యటన
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈజిప్టులో అడుగుపెట్టారు. అక్కడ మోడీ కి ఆ దేశ
ప్రధాని ముస్తఫా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈజిప్టు సేనల గౌరవ వందనాన్ని
స్వీకరించారు. 1997 తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.
మోదీ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. తన పర్యటనలో భాగంగా ఈజిప్టు,
పాలస్తీనాల్లో ఉండి పోరాడి మరణించిన భారతీయ సైనికులకు ప్రధాని నరేంద్ర మోడీ
నివాళి అర్పించనున్నారు. అతి పురాన అల్ హకీమ్ మసీదును సందర్శిస్తారు. ఈజిప్టు
ప్రధానితో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఈ ఏడాది మన గణతంత్ర వేడుకలకు
ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసి హాజరైన సంగతి తెలిసిందే. మోడీ
పర్యటనకు ఈజిప్టు అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది.