* ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీజెన్కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ ను ఈ సందర్భంగా జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి * బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి * ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు.
అమరావతి : ఈ నెల 27న గురువారం ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీజెన్కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ (800 మెగావాట్లు) ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి, 10.55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 11.10 నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు నేలటూరులో ఏపీజెన్కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ (800 మెగావాట్లు) జాతికి అంకితం చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి : ముత్తుకూరు మండలం నేలటూరు సమీపంలో మంగళవారం రాత్రి సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్ పి విజయ రావు, జెసి కూర్మనాథ్, నూడా వీసీ శ్రీ బాపిరెడ్డి, జెన్కో ఇంజనీర్లు, జిల్లా స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు.
ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు : ఈనెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం లోని నేలటూరు గ్రామంలో ఏపీ జెన్కో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ మూడో యూనిట్ ప్రారంభించు సందర్భంగా మంగళవారం సాయంత్రం ముందస్తు భద్రత సమన్వయం (అడ్వాన్స్ సెక్యూరిటీ లైజాన్- ఏ ఎస్ ఎల్) ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, ఏపీ జెన్కో ఎండి బి. శ్రీధర్, జిల్లా పోలీసు అధికారి సిహెచ్ విజయ రావు లతో కలిసి పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఏపీ జెన్కో రాష్ట్ర డైరెక్టర్ టి.చంద్రశేఖర రాజు అదనపు ఎస్పీలు హిమావతి, చౌడేశ్వరి, శ్రీనివాసరావు ఏపీ జెన్కో సి ఈ టి నాగరాజు, ఐఎస్బి డిఎస్పి ఎల్ ఎస్ కే డి ప్రసాద్, పలువురు జిల్లా అధికారులు, డీఎస్పీలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.