సభా స్థలాన్ని పరిశీలించిన అబ్దుల్ అజీజ్.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
తెలుగుదేశం పార్టీ చేపట్టిన రా కదలి రా కార్యక్రమంలో భాగంగా ఈనెల 28 న మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కోవూరు నియోజకవర్గానికి రానున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ లు కోవూరు నియోజకవర్గ ఇన్చార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి తో కలిసి యల్లాయపాలెం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీ వద్ద సభా స్థలాన్ని పరిశీలించారు. చేపట్టవలసిన ఏర్పాట్ల పై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం, కొడవలూరు మండలం, యెల్లాయపాలెం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీ వద్ద రా కదలి రా సభ జరగనుందని కోవూరు నియోజకవర్గ ప్రజలు సభ విజయవంతం చేయాలని అన్నారు. మన జీవితాలు మారాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అందరూ కదలి వచ్చి టీడీపీ కి మద్దతు పలకాలని అన్నారు. వారితో పాటు టీడీపి రాష్ట్ర కార్యదర్శి రాజా నాయుడు, నన్నేసాహెబ్, చెముకుల కృష్ణచైతన్య, అమరేంద్ర రెడ్డి,చెక్క మదన్, కేతు వెంకటరమణా రెడ్డి, ఇంతా మల్లా రెడ్డి, మహేష్ తదితరులు ఉన్నారు.